Wednesday, November 4, 2015

ఆరు విభాగాలుగా జస్టిస్‌ సిటీ

ఆరు విభాగాలుగా జస్టిస్‌ సిటీ 


అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం లేని విధంగా ఒక అత్యున్నతస్థాయి ‘న్యాయ నగరం (జస్టిస్‌ సిటీ)’ని అమ రావతికి శోభనివ్వనున్న నవ నగరా ల్లో ఒకదానిగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. న్యాయవ్యవస్థలోని అంత ర్భాగమైన ప్రతి ఒక్క సంస్థ, విభాగాన్ని పొందుపరచేందుకు ప్రభుత్వం, సీ ఆర్‌డీఏ కసరత్తు చేస్తున్నాయి. ప్రాథమికంగా అందిన విశ్వసనీయ సమాచా రం ప్రకారం ఈ ప్రత్యేక, వినూత్న నగరంలో మొత్తం ఆరు విభాగాలుంటాయి. మళ్లీ వీటిల్లో నూ ఒక్కొక్క దానిలో పలు సంస్థలు భాగంగా ఉంటా యి.‘జస్టిస్‌ సిటీ’లో కొలువు దీరబోయే ఆయా విభాగాల వివరాలివి. 

న్యాయస్థానాలు - ట్రిబ్యునళ్లు 
కక్షిదారులకు స్నేహపూరిత సేవలందించే సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో పని చేసే వివిధ రకాల న్యా యస్థానాలు, ట్రిబ్యునళ్లను దీని కింద నెలకొల్పుతారు. వివిధ రకాల వివాదాలు, వ్యాజ్యాలను వేటికి వాటిని ప్రత్యేకంగా పరిష్కరించేలా వీటిని తీర్చిదిద్దుతారు. అదనంగా ‘ఏడీఆర్‌ సెంటర్లు (సంప్రదింపులు, మధ్యవర్తిత్వం వంటి వాటిని పూర్తి ప్రొఫెషనల్‌ ధోరణిలో నిర్వహించేవి)’ కూడా ఉంటాయి. ఇంకా ఆ ధునిక ‘ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌’ ప్రత్యేక ఆకర్షణ గా నిలవనుంది. 

జస్టిస్‌ ఫ్యాక్టరీలు 
సమీప భవిష్యత్తులో ‘ఆన్‌లైన్‌లో వివాదాల పరిష్కా రం’ పరిపాటి కా నున్నదనే అంచనా తో వీటిని నెలకొల్పనున్నారు. చౌకగా, పారదర్శకంగా, త్వరితంగా అ న్నింటికీ మించి కక్షిదారులు ఎవ రికి వారే ఈ ప్రక్రియలో భాగస్వాములు కానుండడాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని పెద్దఎత్తున వ్యాపార, వాణిజ్య లావాదేవీల పరిష్కారానికి ఉపకరించేలా ఇలాంటి ‘జస్టిస్‌ ఫ్యాక్టరీ’లను ప్రారంభిస్తారు. 

న్యాయ సంస్కరణలు..
చట్టసభల డ్రాఫ్టింగ్‌ కేంద్రాలు 

సాధారణ న్యాయసంబంధమైన వివాదాలకే పరిమితం కాకుండా వివిధ సాంఘిక, ఆర్థిక వివాదాలు, సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలను కనుగొనేందుకు దీనిని ఉద్దేశించారు. ఇందుకు అవసరమైన సర్వేలు, సామాజిక ప్రభావ అంచనా (సోషల్‌ ఇం పాక్ట్‌ అసెస్‌మెంట్‌), వ్యయలాభాల విశ్లేషించే సంస్థ లు, టాస్క్‌ఫోర్స్‌లకు ఇందులో స్థానం కల్పిస్తారు. ఈ సంస్థల సేవలను ప్రభుత్వం లేదా కార్పొరేట్‌ సంస్థలు హేతుబద్ధ ధర చెల్లించి, పొందే వీలుంటుంది. 

ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలలు
- సంచార కేంద్రాలు 

భవిష్యత్‌లో వివిధ నేరాలు, కేసుల విచారణలో ఫోరెన్సిక్‌ ఆధారాలు ప్రధాన పాత్ర పోషించనున్నందున జస్టిస్‌ సిటీలో స్పెషలైజ్డ్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీలు, మొబైల్‌ సెంటర్లను నెలకొల్పుతారు. వీటి సేవలను కేవలం న్యాయస్థానాలే కాకుండా ప్రైవేట్‌ పార్టీ లు సైతం అన్ని వివాదాల పరిష్కారంలో ఉపయోగించుకునే వీలు కల్పిస్తారు. 

విద్య, శిక్షణ సంస్థలు 
న్యాయ కళాశాలలు, జ్యుడీషియల్‌, పోలీస్‌, సివిల్‌ సర్వీస్‌ ట్రైనింగ్‌ అకాడమీలతోపాటు నిరంతర న్యాయ అభ్యసన సంస్థ లు ఏర్పాటవుతాయి. పారా లీగల్‌, వివిధ సహాయక సిబ్బంది, లెజిస్లేటివ్‌ డ్రాఫ్టింగ్‌, న్యాయ పరిశోధన త దితర శిక్షణ సంస్థలను నెలకొల్పుతారు. 

జస్టిస్‌ మ్యూజియంలు- గ్రంథాలయాలు 
వివిధ దేశాల న్యాయవ్యవస్థకు సంబంధించిన విశేషాలను పొందుపరుస్తూ మ్యూజియంలను ఏర్పాటు చేస్తారు. తెలియజేసే జర్నల్స్‌ ఇత్యాది ఉపయుక్త సమాచారాన్నంతటినీ అందించే ‘స్పెషలైజ్డ్‌ లా ల్రైబరీ’లనూ నెలకొల్పుతారు

No comments:

Post a Comment